: అమరావతిలో పోటా పోటీ ధర్నాలు... జగన్ కు పోటీగా రంగంలోకి దిగిన తెలుగుదేశం
నవ్యంధ్ర రాజధాని అమరావతి ప్రాంతం నేడు ధర్నాలతో దద్దరిల్లుతోంది. ఏపీ సర్కారు తలపెట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా కాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) ఎదుట వైకాపా నేత జగన్ భారీ ఎత్తున అనుచరులతో ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. కేవలం రాజకీయాలు చేసి ప్రజలను మభ్యపెట్టేందుకే జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ, తెలుగుదేశం పార్టీ 'కనువిప్పు' పేరిట కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో ధర్నా మొదలు పెట్టింది. విజయవాడ టీడీపీ నగర కమిటీ ఈ ధర్నాను చేపట్టింది. పోటాపోటీ ధర్నాలతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారగా, పోలీసులు అప్రమత్తమయ్యారు. అటు సీఆర్డీఏ కార్యాలయం వద్ద, ఇటు మునిసిపల్ కార్పొరేషన్ వద్ద ఎదుట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.