: బెంగళూరు ప్రజలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన మాజీ ముఖ్యమంత్రి
బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికల్లో జేడీఎస్ ఘోర ఓటమిని చవిచూసింది. ఈ పరాభవంపై ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గౌడ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. 'ఓటర్లు ఇచ్చిన తీర్పుతో బెంగళూరుకు మరోసారి అపాయం ఎదురుకాబోతోంది' అని హెచ్చరించారు. అవినీతిపరులకు, చెరువులు, భూములు కబ్జా చేసేవారికి బెంగళూరువాసులు ఓట్లు వేశారని అన్నారు. 'వీలైతే ఇలాంటి వారితో మీరు కూడా కలసిపోండి. లేకపోతే మౌనంగా కూర్చోండి' అన్న రీతిలో ఓటర్ల తీర్పు ఉందని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచి, బెంగళూరును అభివృద్ధి పథంలో తీసుకుపోదామని తాము భావిస్తే... ఓటర్లు మాత్రం దానికి విరుద్ధమైన తీర్పును ఇచ్చారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.