: రైలును తాకిన గ్రానైట్ రాయికి మహిమలు... పూజలు చేస్తున్న రైల్వే ఉద్యోగులు!


వేగంగా వెళుతున్న నాందేడ్ ఎక్స్ ప్రెస్ ను తాకి ఐదుగురి మృతికి కారణమైన గ్రానైట్ బండరాయికి ఏవో మహిమలు ఉన్నాయని రైల్వే ఉద్యోగులు, కూలీలు నమ్ముతున్నారు. గతంలో ఎన్నడూ ఇటువంటి ఘటన జరగలేదని, అసలు రాయి గాల్లోకి ఎగిరి రైలును అంత బలంగా తాకిందంటే నమ్మశక్యంగా లేదని చెబుతూ, దానికి పూజలు చేస్తున్నారు. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు చేస్తున్న కూలీలు, కొందరు రైల్వే ఉద్యోగులు పెనుకొండ నుంచి ప్రత్యేకంగా పూలు, పసుపు, కుంకుమ తెప్పించి పూజలు చేశారు. దీనికేదో శక్తి ఉండబట్టే గాలిలోకి ఎగిరి బోగీలోంచి దూసుకెళ్లిందని వారు చెబుతున్నారు. రాయికి పూజలు జరుగుతున్నాయని తెలియగానే, మరింతమంది 'రాయి భక్తులు' క్యూకట్టేశారు.

  • Loading...

More Telugu News