: ఉల్లి ‘కన్నీళ్లు’ తగ్గాలా?... అయితే ‘ఆన్ లైన్’ బాట పట్టాల్సిందే!


ఉల్లి కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తోంది. నానాటికి చుక్కలంటుతున్న ఉల్లి ధర ‘సెంచరీ’ కొట్టేందుకు చేరువైంది. దీంతో దేశవ్యాప్తంగా ఉల్లి ‘గోల’ పెరుగుతోంది. ఉల్లి ‘ఘాటు’ నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు తెలుగు రాష్ట్రాలు ప్రవేశపెట్టిన సబ్సిడీ ఉల్లి కూడా అంతంత మాత్రంగానే ఫలితమిస్తోంది. ఈ నేపథ్యంలో ఉల్లి కొనేదెట్టా?.. తినేదెట్లా? అన్న ఆందోళన ప్రజలను పట్టి పీడిస్తోంది. ఈ క్రమంలో ఉల్లి ‘కన్నీళ్లు’ తుడుస్తామంటూ తాజాగా ఆన్ లైన్ పచారీ కేంద్రాలు రంగంలోకి దిగాయి. మార్కెట్ లో ప్రస్తుతం రూ.80 దాకా పలుకుతున్న కిలో ఉల్లిని తాము రూ.40 నుంచి రూ. 69కే అందిస్తామంటూ పలు ఆన్ లైన్ విక్రయ కేంద్రాలు ప్రకటనలు జారీ చేశాయి. ‘లోకల్ బన్యా’, ‘మేరా గ్రోసర్’, ‘ఫ్రెస్ పాల్ సబ్జీ.కామ్’లు ఈ తరహా విక్రయాలకు తెరలేపాయి. మధ్య దళారుల ప్రమేయం లేకపోవడం, రవాణా చార్జీలను గణనీయంగా తగ్గించుకుంటున్న నేపథ్యంలోనే తాము ఉల్లిని మార్కెట్ ధరలో సగానికే అందిస్తున్నామని ఈ సంస్థలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News