: బీజేపీని హెచ్చరించిన శత్రుఘ్నసిన్హా
బీజేపీ సీనియర్ నేత, సినీ నటుడు శత్రుఘ్నసిన్హా తన పార్టీని పరోక్షంగా హెచ్చరించారు. గతంలో ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన శత్రుఘ్నసిన్హా పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన బీహార్ సీఎం నితీష్ కుమార్ ను పలుమార్లు కలిసి అభినందించారు. దీంతో బీహార్ ఎన్నికల తరువాత బీజేపీ ఆయనపై చర్యలు తీసుకోనుందంటూ వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వార్తలపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. బీహార్ లో ఎన్నికలు ముగిసిన తరువాత తనపై పార్టీ చర్యలు తీసుకోనుందంటూ వార్తలు ప్రసారమవుతున్నాయని... అయితే ప్రతీ చర్యకు ప్రతి చర్య ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలని శత్రుఘ్నసిన్హా వ్యాఖ్యానించారు.