: ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకే చంద్రబాబు మిన్నకుండిపోయారు: జగన్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా అధినేత జగన్ విరుచుకుపడ్డారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకే రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద చంద్రబాబు తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా రాదని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటని అన్నారు. కేంద్రంతో ఉన్న లోపాయకారీ ఒప్పందం వల్లే ప్రత్యేక హోదాపై చంద్రబాబు మౌనం వహించారని విమర్శించారు. ఈ రోజు ఢిల్లీలో చంద్రబాబు కానీ, కేంద్ర ప్రభుత్వ పెద్దలు కానీ ప్రత్యేక హోదాపై మాట్లాడకపోడం దారుణమన్నారు. ప్రత్యేక హోదా ప్రజల హక్కు అని... దాన్ని ఎలాగైనా సాధించుకుంటామని చెప్పారు.