: ఐపీఎల్ లో ఆడేందుకు సన్నాహాలు చేసుకుంటున్న క్లార్క్


ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఐపీఎల్ లో తిరిగి రంగప్రవేశం చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టాడు. యాషెస్ సిరీస్ లో ఘోర పరాజయం తరువాత అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన క్లార్క్ ఐపీఎల్ లో ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. ఐపీఎల్ లో పూణే జట్టు తరపున ఆడిన క్లార్క్, ఆ తరువాత పేలవ ప్రదర్శనతో స్వదేశంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. దీంతో ఐపీఎల్ లో ఆడకూడదని నిర్ణయించుకుని ఆసీస్ జాతీయ జట్టుకు ఆడాడు. రిటైర్మెంట్ తరువాత భార్యతో కలిసి విహార యాత్ర ప్లాన్ చేసుకున్న క్లార్క్, అది ముగిసిన తరువాత భవిష్యత్ ప్రణాళిక ప్రకటిస్తానని పేర్కొన్నాడు. అందులో భాగంగా ఐపీఎల్ పై ఆసక్తి ప్రదర్శించాడు. ఆరేళ్ల నుంచే క్రికెట్ తనలో భాగమైపోయిందని క్లార్క్ చెబుతున్నాడు.

  • Loading...

More Telugu News