: ఆ గదిలోకి క్యూ కడుతున్న బాలీవుడ్ తారలు
అదొక చిన్న అద్దాల గది. ఆ గదిలో ఒక గంటసేపు ఉంటే చాలు... వారి చర్మం మెరుపుతో కాంతులీనుతుంది. అందుకే బాలీవుడ్ తారలు ఆ గదిలోకి క్యూ కడుతున్నారు. వివిధ దేశాల్లో తిరుగుతూ ఎండ, వేడిమి, చలి, వర్షం ఇలా ఎన్నో రకాల పరిస్థితుల్లో షూటింగ్ లో పాల్గొనే తారలకు వారి చర్మం కమిలిపోవడమో లేక మొద్దుబారి పోవడమో జరుగుతుంది. అందువల్ల వారి చర్మ సౌందర్యం విషయంలో వారు చాలా కేర్ తీసుకుంటారు. మంచి బ్యూటీ పార్లర్లకు వెళ్లి చర్మాన్ని కాపాడుకుంటుంటారు. అయితే, ఇప్పుడు సరికొత్త థెరపీ అందుబాటులోకి వచ్చింది. అదేంటంటే... చిన్న అద్దాల గదిలో ఆక్సిజన్ నింపి ఉంచుతారు. ఈ గదిలో గంటసేపు గడిపితే చాలు... చర్మం నూతనోత్తేజం పొందుతుంది. ఈ థెరపీ పేరు హెచ్ బీఓటీ (హైడ్రో బేరిక్ ఆక్సిజన్ థెరపీ). బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్, 'హీరో' సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అవుతున్న నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియ శెట్టి, హీరోలు వరుణ్ ధావన్, అమిత్ సాద్ తదితరులు ఈ థెరపీ కోసం క్యూ కడుతున్నారట. మరో విషయం ఏమిటంటే, ఈ గదిలో ఒక గంటసేపు గడపడానికి రూ. 20 వేలు చెల్లించాల్సి ఉంటుంది.