: కాశ్మీర్ నేతలతో చర్చించడంలో తప్పేముంది?: నవాజ్ షరీఫ్


కాశ్మీర్ వేర్పాటువాద నేతలతో పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు సమావేశం ఇటీవల రద్దవడంపై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తీవ్రంగా స్పందించారని తెలిసింది. ఇస్లామాబాద్ లో జరిగిన ఫెడరల్ క్యాబినెట్ భేటీలో షరీఫ్ మాట్లాడుతూ, పాకిస్తాన్, భారత్ తప్ప కాశ్మీర్ సమస్య పరిష్కారానికి మూడో వ్యక్తి లేదా మూడో కూటమికి తావులేదని భారత్ అంటోందని ప్రస్తావించారు. అయితే కాశ్మీర్ నాయకులు థర్డ్ పార్టీ కాదు కదా? అని అంటూ, ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. నిజానికి వారే ప్రధాన పార్టీ అని, అలాంటివారితో చర్చిస్తామని తాము అన్నందుకు భారత్ తమతో చర్చల్ని రద్దు చేసుకుందని షరీఫ్ పేర్కొన్నారు. వాస్తవానికి 'ఉఫా'లో మోదీ, షరీఫ్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఉగ్రవాదం ప్రధానాంశంగా భారత్-పాకిస్థాన్ మధ్య జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరగాల్సి ఉంది. కానీ పలు కారణాలతో రద్దవడంతో మళ్లీ చర్చలకు విఘాతం ఏర్పడింది.

  • Loading...

More Telugu News