: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన బీహార్ మాజీ సీఎం మాంఝీ
బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. జెహనాబాద్ నుంచి జేడీ (యూ) తరపున ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ ఉదయం బీహార్ అసెంబ్లీ తాత్కాలిక కార్యదర్శి హరే రామ్ ముఖియాను కలిసిన మాంఝీ తన రాజీనామా లేఖను ఆయనకు సమర్పించారు. మాంఝీ రాజీనామా తనకు అందిందని ముఖియా వెల్లడించారు. కాగా, 70 సంవత్సరాల మాంఝీ ఇప్పటివరకూ ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రెండేళ్ల క్రితం నితీష్ రాజీనామా తరువాత బీహార్ ముఖ్యమంత్రిగా సేవలందించారు.