: తెలంగాణ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది: కేసీఆర్


తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కొందరు నేతలు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. కొన్ని పత్రికలు కూడా ఈ విషయంపై పనిగట్టుకుని వార్తలు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి తెలంగాణ ఆర్థిక పరిస్థితి చాలా బాగుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వారసత్వంగా వచ్చిన సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని... అంచనాలకు తగ్గట్టుగానే బడ్జెట్ ను కూడా రూపొందించుకున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News