: ఉత్తరప్రదేశ్ లో నిందితుల తీరు ఇలా ఉంటుంది...!
ఉత్తరప్రదేశ్ లో అరాచకాల స్థాయిని తెలిపే ఘటన ముజఫర్ నగర్ జిల్లా కుర్వావాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... పూగానా స్టేషన్ పరిధిలోని కుర్వావా గ్రామంలో ఆగస్టు 21న అంకుర్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిపై అత్యాచారానికి తెగబడ్డాడు. దీంతో బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి అతడి అఘాయిత్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో అతనికి చిర్రెత్తుకొచ్చింది. నా మీదే కేసు పెడతావా? అంటూ, మరోసారి ఆమెను ఒంటరిగా దొరకబుచ్చుకుని 'అత్యాచారం కేసు వాపస్ తీసుకోవాలని, లేని పక్షంలో మళ్లీ రేప్ చేస్తా'నని బెదిరించాడు. ఈ విషయాన్ని యువతి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పరారీలో ఉన్న అంకుర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.