: విద్యుత్ ఉద్యోగుల సమస్యను సెప్టెంబర్ 3లోగా పరిష్కరించండి... కేంద్రానికి హైకోర్టు ఆదేశం


స్థానికత ఆధారంగా తెలంగాణ జెన్ కో నుంచి రిలీవ్ చేసిన 1,253 మంది ఏపీ విద్యుత్ ఉద్యోగుల పిటిషన్ పై ఉమ్మడి హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను సెప్టెంబర్ 3వ తేదీలోగా పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఇరు రాష్ట్రాల అధికారులను పిలిచి సమస్యను పరిష్కరించాలని చెప్పింది. కొన్ని నెలల నుంచి ఈ సమస్యపై ఉద్యోగులు పోరాడుతున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన లేదు. దాంతో ఉద్యోగులు కోర్టుకు వెళ్లారు.

  • Loading...

More Telugu News