: నాపై అవగాహన లేకే పవన్ కల్యాణ్ అలా మాట్లాడారు: ఎంపీ మురళీమోహన్
ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం సందర్భంగా ఎంపీ మురళీమోహన్ కు చెందిన 15 ఎకరాల భూమి పోతున్నప్పుడు ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారంటూ ఇటీవల రాజధాని గ్రామాల్లో పర్యటించిన సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా మురళీమోహన్ స్పందించారు. తనపై అవగాహన లేకే పవన్ అలా మాట్లాడారని అన్నారు. రింగ్ రోడ్డులో వున్న తన భూములపై ఆరోపణలు చేశారనే సుప్రీంకు వెళ్లానని తెలిపారు. అవసరమైతే రాజధాని నిర్మాణ ప్రాంతంలో పర్యటిస్తానని చెప్పారు. అయితే నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో తాను భూమి కొనుగోలు చేశానన్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా రైతులు భూములను త్యాగం చేయాల్సి ఉంటుందన్నారు.