: 30 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ... పైగా కోటీశ్వరుడు...అయినా 'ముష్టి' ఎత్తడం మానడు!


ముంబైలో రోజుకు ఏడు లేదా ఎనిమిది గంటలే అతను పని చేస్తాడు. రోజుకు సంపాదన రూ. 2 వేల నుంచి రూ. 3 వేలుంటుంది. అంటే, నెలకు దాదాపు రూ. 60 నుంచి రూ. 90 వేల ఆదాయం. ముంబైలోని పరేల్ ప్రాంతంలో రెండు ఇళ్లున్నాయి. వాటి విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారమే రూ. 80 లక్షలు. మరో షాపు కూడా ఉంది. ఇంతకీ అతని పేరు చెప్పలేదు కదా! భరత్ జైన్... ఏదో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడనుకుంటే పప్పులో కాలేసినట్టే. భరత్ జైన్ చేపట్టిన ఉద్యోగం యాచకం. ఉన్న రెండిళ్లూ అద్దెలకు ఇచ్చేసి, ఓ చిన్న అద్దె ఇంట్లో ఉండే భరత్ జైన్ కుటుంబ సభ్యులు వ్యాపారాలు చేస్తున్నారు. మనోడు మాత్రం గత 30 ఏళ్లుగా యాచక వృత్తిలోనే కొనసాగుతున్నాడు. ఇండియాలోని బెగ్గర్లలో అత్యంత ధనికుడు ఇతనేనట. మొదటి నుంచి నమ్ముకున్న యాచనలోనే మిగతా జీవితాన్ని గడిపేస్తానని భరత్ చెబుతుంటాడు.

  • Loading...

More Telugu News