: ప్రత్యేక రాష్ట్రం కోసం నేపాల్ లో ఆందోళన... రక్తసిక్తం
పొరుగు దేశం నేపాల్ లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఊపందుకుంది. చాలా కాలంగా థరూ జాతికి చెందిన ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో, తాజాగా నేపాల్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన నూతన రాజ్యాంగంలో తమకు ప్రత్యేక రాష్ట్రం కేటాయించకపోవడంతో థరూ జాతికి చెందిన వారు ఆగ్రహోదగ్రులయ్యారు. తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో కైలాలీ జిల్లాలో కర్ఫ్యూ విధించారు. అయినప్పటికీ, కర్ఫ్యూ ప్రాంతంలో పోలీసులపై థరూ ప్రజలు దాడి చేశారు. ఏకంగా ఆరుగురు పోలీసులను హతమార్చారు. సీనియర్ ఎస్పీని కత్తులు, కొడవళ్లతో పొడిచి చంపారని, హెడ్ కానిస్టేబుల్ ను సజీవ దహనం చేశారని పోలీసు అధికారులు వెల్లడించారు.