: బీహార్ మాదిరిగా తెలంగాణకు కూడా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి: ఎమ్మెల్సీ కర్నె


తెలంగాణకు కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కోరుతున్నారు. అది కూడా బీహార్ మాదిరిగా ఆ ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేవలం గ్రామాల అభివృద్ధికి మాత్రమే కేంద్రం నుంచి ఇలా సాయం కోరుతున్నామని చెప్పారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. విభజన చట్టంలోని అనేక హామీలను నెరవేర్చకుండా తమ రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపుతోందని ఈ సందర్భంగా విమర్శించారు. రహదారులు, విద్య, వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో తెలంగాణ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్న కర్నె, దానికి అనుగుణంగా కేంద్ర ప్రభత్వ సాయం కూడా అవసరమని చెప్పారు. రాష్ట్రానికి న్యాయంగా రావల్సిన 1200 టీఎంసీల నీటిని 58 ఏళ్ల పాటు కోల్పోయామన్నారు. ఇప్పటికైనా తమ నీటిని దక్కించుకోవాలన్న ఆలోచనతో రూ.25వేల కోట్లతో పాలమూరు ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టామని టీఆర్ఎస్ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. సంక్షేమ పథకాలకు కేంద్రం సాయం అవసరమని, ఈ విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు కేంద్రాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News