: రెండేళ్లలో జగన్ సీఎం కావడం ఖాయం: మేకా ప్రతాప్
మరో రెండేళ్లలో వైకాపా అధినేత జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆ పార్టీకి చెందిన నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఒక్క పని కూడా చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు కాలం గడుపుతున్నారని... ఈ క్రమంలో, చంద్రబాబును ప్రజలు వ్యతిరేకించే పరిస్థితి తలెత్తుతుందని... ఆయన తన పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితి వస్తుందని అన్నారు. చంద్రబాబు గతంలో సీఎం అయినప్పుడు కరవు వచ్చిందని... ఇప్పుడు కూడా కరవు వచ్చిందని ఎద్దేవా చేశారు. జగన్ సీఎం అయితేనే వర్షాలు పడేలా ఉన్నాయని అన్నారు. మచిలీపట్నంలో జగన్ చేపట్టిన ధర్నాలో ఆయన ప్రసంగిస్తూ పైవ్యాఖ్యలు చేశారు.