: లాహోర్ లో పుట్టి, న్యూఢిల్లీ చెత్త మార్కెట్ కు చేరిన వందేళ్లనాటి పురాతన హిందూ గ్రంథం


సుమారు 105 సంవత్సరాల క్రితం అవిభాజ్య భారతావనిలోని లాహోర్ (ప్రస్తుతం పాకిస్థాన్ లో భాగం)లో, ఉర్దూ భాషలో ముద్రితమైన 'శ్రీ రామచరిత మానస్' గ్రంథం న్యూఢిల్లీలోని ఓ స్క్రాప్ మార్కెట్లో వెలుగులోకి వచ్చింది. దీన్ని సంకట్ మోచన్ దేవాలయం పూజారి కుటుంబం రూ. 600 చెల్లించి కొనుగోలు చేసింది. దేవాలయంలోని తులసీ ఘాట్ నుంచి, దొంగిలించబడ్డ పురాతన లిఖిత గ్రంథాలను వెతుకుతున్న క్రమంలో ఈ పుస్తకం లభించినట్టు తెలుస్తోంది. గోస్వామి తులసీదాస్ స్వయంగా రాసిన ప్రతుల కోసం ఆలయ పూజారి, హైడ్రాలిక్స్ ప్రొఫెసర్ వీరభద్ర మిశ్రా, ఆయన కుమారులు మిశ్వంభర నాథ్, విజయ్ నాథ్ లు దేశవ్యాప్తంగా దాని కోసం వెతుకుతుండగా, ఈ ఉర్దూ వర్షన్ లభించింది. తులసీదాస్ అనుచరుడిగా పేరున్న శివబ్రత్ లాల్ 1904లో ఉర్దూ అనువాదం చేయగా, లాహోర్ లోని హాఫ్-టోన్ ప్రెస్ లో దీన్ని ముద్రించారు. ఇటీవల ఆలయ సందర్శనకు వచ్చిన ప్రధాని మోదీకి ఈ గ్రంథాన్ని బహూకరించగా, ఆయన సైతం ఆశ్చర్యపోయారట. ఈ పుస్తకంలో చేతితో గీసిన రామ, సీత, లక్ష్మణ, హనుమంతుని చిత్రాలతో పాటు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల చిత్రాలను కూడా ముద్రించారు.

  • Loading...

More Telugu News