: కిష్టారెడ్డి మరణం కాంగ్రెస్ కు తీరని లోటు: సునీతా లక్ష్మారెడ్డి
నారాయణ ఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి హఠాన్మరణం పట్ల ఆ పార్టీ నాయకురాలు సునీతా లక్ష్మారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి చెందడం బాధాకరమన్నారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని సునీత కన్నీటి పర్యంతమయ్యారు. రాజకీయాల్లో తనకు తండ్రిలా వెన్నంటి ఉండేవారని గుర్తు చేసుకున్నారు. తాము గొప్ప నాయకుడిని కోల్పోయామని తెలిపారు. కిష్టారెడ్డికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని ఆమె చెప్పారు.