: తెలుగువాడిగా రాష్ట్రానికి నా సహకారం అందిస్తా: వెంకయ్యనాయుడు


ఏపీ పునర్విభజన చట్టం సమగ్రంగా అమలయ్యేలా చూడాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖను కోరామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. దానిపై అధికారులతో సమావేశమై పరిష్కార మార్గాలు కనుక్కుంటామని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారని పేర్కొన్నారు. తెలుగువాడిగా రాష్ట్రానికి తన పూర్తి సహకారం అందిస్తానని వెంకయ్య స్పష్టం చేశారు. ఢిల్లీలోని వెంకయ్య నివాసానికి వచ్చిన రాజ్ నాథ్ తో చంద్రబాబు, వెంకయ్య సమావేశమై ఏపీ అంశాలపై చర్చించారు. అనంతరం వెంకయ్య మీడియాతో మాట్లాడారు. ఏపీలో సంస్థల ఏర్పాటు విషయంలో ముందుకు వెళుతున్నామన్నారు. ఆర్థిక పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోందని, విభజన వల్ల ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News