: మంచి రోజులు వస్తాయని మేమెప్పుడూ హామీ ఇవ్వలేదే!: కేంద్ర మంత్రి నరేంద్ర తోమర్


తామెప్పుడూ 'అచ్ఛే దిన్' (మంచి రోజులు) వస్తాయని హామీ ఇవ్వలేదని, అది తమ స్లోగన్ కాదని కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రి నరేంద్ర తోమర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. "మంచి రోజులు అన్న పదం సామాజిక మాధ్యమాల్లో మొదలైంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ నేతృత్వంలో ఆ పార్టీ ఓడిపోయి మంచి రోజులు వస్తాయని ప్రచారం జరిగింది. మేమూ దాన్ని అంగీకరించామే తప్ప, మంచి రోజులు వస్తాయని మేమెన్నడూ చెప్పలేదు. అది మా నినాదం కాదు" అని ఆయన మీడియాకు వెల్లడించారు. కాగా, 2014 సాధారణ ఎన్నికల సమయంలో సామాజిక మాధ్యమాల్లో నరేంద్ర తోమర్ చేసిన వ్యాఖ్యలు ఎంతో పాప్యులర్ అయ్యాయి. 'అచ్ఛే దిన్ ఆయేంగే', 'రాహుల్ గాంధీ నానీ కే ఘర్ జాయేంగే' అని ఆయన చేసిన వ్యాఖ్యలకు మంచి స్పందన వచ్చింది. ఈ మాటలు సోషల్ మీడియా నుంచే తాను సేకరించానని, ఇవి తమ సొంత మాటలు కాదని చెప్పుకొచ్చారు. పెరుగుతున్న ఉల్లి, పప్పుధాన్యాల ధరల గురించి ప్రస్తావిస్తూ, వీటి ధరలను నియంత్రణలో ఉంచేందుకు తాము అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నామని తోమర్ తెలిపారు.

  • Loading...

More Telugu News