: సోషల్ మీడియాను ఊపేసిన కానిస్టేబుల్ సస్పెన్షన్


రెండు రోజుల క్రితం సోషల్ మీడియాను ఓ పోలీస్ కానిస్టేబుల్ ఊపేశారు. దేశంలో ఉన్న పోలీసు వ్యవస్థను సోషల్ మీడియా తూర్పారబట్టేందుకు ఆయన ఆయుధంగా నిలిచారు. ఢిల్లీ మెట్రోలో తప్పతాగి ప్రయాణం చేస్తూ ఓ పోలీసు కానిస్టేబుల్ ఔత్సాహికుడి స్మార్ట్ ఫోన్ కెమెరా కంటికి చిక్కారు. ఒళ్లు తూలిపోయే స్థితిలో ఆధారం కోసం ప్రయత్నిస్తూ, దొరికిన ఆధారాన్ని వదిలేసి, ఆజాద్ పూర్ స్టేషన్ లో ట్రైన్ ఆగగా, అడ్డంగా పడిపోయిన కానిస్టేబుల్ ను తిట్టుకుంటూ తోటి ప్రయాణికులు ఓ కుర్చీలో కూర్చోబెట్టి సపర్యలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసు వ్యవస్థపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఈ వీడియోను అసక్తిగా తిలకించి, మీరూ తిలకించండి అంటూ షేర్లు చేయడంతో ఇది ఢిల్లీ పోలీసులను చేరింది. దీంతో, వీడియోను తిలకించిన ఉన్నతాధికారులు పోలీసుల పరువుతీసేశాడని భావించి, సదరు కానిస్టేబుల్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు.

  • Loading...

More Telugu News