: అండమాన్ ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ
జాతీయ పార్టీగా ఎదిగేందుకు తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో అండమాన్ నికోబార్ దీవుల్లో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ భావిస్తోంది. రాజధాని పోర్ట్ బ్లెయిర్ పురపాలక సంఘం ఎన్నికలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు జరగనుండగా, బరిలో దిగి సత్తా చాటాలని తెలుగుదేశం కృతనిశ్చయంతో ఉంది. అండమాన్ నికోబార్ స్థానిక ఎన్నికల్లో టీడీపీకి బీజేపీ మద్దతు ప్రకటించింది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ, తెలంగాణలో పార్టీ విభాగాలు ఏర్పాటు చేసిన టీడీపీ అధినాయకత్వం భవిష్యత్తులో పొరుగు రాష్ట్రాల్లోనూ పార్టీ కార్యకలాపాలు విస్తరించాలని నిర్ణయించింది. కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లోనూ పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.