: ఢిల్లీకి బయల్దేరిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. రేపు ఉదయం 10:30 నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ప్రధానితో జరిగే భేటీలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై ప్రజల మనోభావాలతో కూడిన డాక్యుమెంటరీని ప్రదర్శించే అవకాశం ఉండగా, ఏపీకి ప్యాకేజీ, ప్రత్యేకహోదాపై స్పష్టమైన ప్రతిపాదనలు సీఎం సమర్పించనున్నారు. పార్లమెంట్ లో ప్రత్యేకహోదా ఎవరికీ ఇచ్చేది లేదని స్పష్టం చేయడంతో ఏపీలో ఆందోళన చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నిరసనల అనంతరం తొలిసారి సీఎం చంద్రబాబు నేరుగా ప్రధాని మోదీతో భేటీ కానుండడంతో ఈ సమావేశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.