: ఎన్టీఆర్ పై కవిత రాసి టీడీపీ నేతలకు వినిపించిన స్పీకర్ మధుసూదనాచారి


తెలంగాణ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారిని కలిశారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి దివంగత ఎన్టీఆర్ ను పొగడ్తల్లో ముంచెత్తారు. ఆ మహనీయుడిపై తాను రాసిన కవితను చదివి వినిపించారు. ఎన్టీఆర్ పేరులోని ప్రతి అక్షరాన్ని ఉదహరిస్తూ ఆ కవితను అక్షరబద్ధం చేశారట. ఎన్టీఆర్ పై ఇంతకంటే బాగా మరెవరూ కవిత రాయలేరని ఆయన టీడీపీ నేతలతో పేర్కొన్నట్టు తెలిసింది. ఇంతకంటే బాగా ఎవరైనా ఎన్టీఆర్ పై కవిత రాస్తే వారికి లక్షా వెయ్యి నూటపదహార్లు బహుమతిగా ఇస్తానని కూడా అన్నారట. ఎర్రబెల్లి, రావుల కూడా ఎన్టీఆర్ తో తమ అనుబంధాన్ని స్పీకర్ తో పంచుకున్నారు.

  • Loading...

More Telugu News