: జిహాదీ జాన్ ను వేటాడండి... పట్టుకోండి, లేకపోతే చంపేయండి: నిఘా సంస్థకు కామెరాన్ ఆదేశం


ఐఎస్ఐఎస్ గ్రూపులో అత్యంత కరుడుగట్టిన మిలిటెంట్ గా పేరుగాంచిన జిహాదీ జాన్ అలియాస్ మహ్మద్ ఎమ్వాజీ తొలిసారి ముసుగు లేకుండా ఓ వీడియోలో కనిపించడం తెలిసిందే. తాజాగా, బ్రిటన్ కు తిరిగి రావాలనుందని, దేశంలో తలలు తీయాలనుందని జిహాదీ జాన్ ప్రకటించాడు. 'ఖలీఫా'తో బ్రిటన్ వస్తానని, ముస్లిమేతరులను చంపేస్తానని హెచ్చరించాడు. ఈ వీడియో ప్రకటనను బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ తీవ్రంగా పరిగణించారు. జిహాదీ జాన్ ను వేటాడాలని ఎంఐ6 నిఘా సంస్థకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అతడిని పట్టుకోవాలని, లేకపోతే చంపేయాలని సూచించారు. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నాలను రెట్టింపు చేయాలని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా కామెరాన్ ప్రతి రోజూ అధికార వర్గాలతో సమావేశమవుతూ జిహాదీ జాన్ అంశానికే ప్రాధాన్యమిస్తున్నారు. పలువురు పాశ్చాత్యులను జిహాదీ జాన్ పాశవికంగా గొంతు కోసి హతమార్చడం, ఆపై ఆ వీడియోలను ఐఎస్ ఆన్ లైన్ లో ఉంచడం ప్రపంచ దేశాలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది.

  • Loading...

More Telugu News