: అధికారుల నిర్వాకం...తల్లీ బిడ్డల్ని ఇంట్లో ఉంచి సీల్ వేసేశారు
ఉత్తరప్రదేశ్ లో అధికారుల నిర్వాకం తల్లీబిడ్డలను ఇబ్బందులకు గురి చేసింది. నోయిడాలోని తన ఆరునెలల పసికందుతో ఓ మహిళ నివసిస్తోంది. ఆమె భర్త దినేష్ ఉద్యోగ రీత్యా యూఎస్ లోని ఒహాయోలో ఉంటున్నారు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తున్న దినేష్, కొన్ని కారణాల రీత్యా యూపీ లేబర్ డిపార్ట్ మెంట్ కు లక్ష రూపాయలు బకాయిపడ్డారు. ఆ బకాయి వసూలు చేసేందుకు అతని ఇంటికి వచ్చిన అధికారులు, అందులో మనుషులు ఉన్నదీ లేనిదీ చూసుకోకుండానే ఇంటికి సీల్ చేసి వెళ్లిపోయారు. అనంతరం ఆ ఇంట్లో ఆరునెలల పసికందుతో ఓ తల్లి ఉంటున్న విషయం తెలిసి, సీల్ తెరిచారు. ఇంట్లో ఎవరూ లేరని భావించి సీల్ వేశామని, ఉద్దేశపూర్వకంగా సీల్ చేయలేదని అధికారులు ఆమెకు సంజాయిషీ ఇచ్చారు.