: కొత్త రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి చంద్రబాబు కృషిని అభినందిస్తున్నా: రతన్ టాటా
విజయవాడలోని గేట్ వే హోటల్లో జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబును ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా అభినందించారు. కొత్త రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి చంద్రబాబు కృషిని అభినందిస్తున్నానన్నారు. స్వయం కృషితో దేన్నయినా సాధించగల వ్యక్తి చంద్రబాబు అని ప్రశంసించారు. ఆయన నాయకత్వంలో దేశంలోనే నెంబర్ వన్ గా ఏపీ ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి చేయూతనిస్తామని, ఫిషరీస్, ఆక్వా అభివృద్ధికి సహకరిస్తామని టాటా హామీ ఇచ్చారు. ఇదే సమయంలో పలువురు పారిశ్రామికవేత్తలు అడిగిన ప్రశ్నలకు టాటా సమాధానం ఇచ్చారు.