: నాటి మ్యాగీ కార్మికులు... నేడు రిక్షాలు తొక్కుతున్నారు!
మ్యాగీ వివాదం, అనంతరం నిషేధం విధించిన నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో నెస్లే కంపెనీకి చెందిన ఉద్యోగులు, కార్మికులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. దాంతో ఏదో ఒక పని చేస్తూ కొంతమంది కాలం వెళ్లదీస్తున్నారు. వారిలో మరికొంత మంది రిక్షాలు తొక్కుకుంటూ ఉపాధి పొందుతున్నారు. ఉత్తరాఖండ్ లోని నెస్లే కంపెనీకి చెందిన రుద్రపూర్ ప్లాంట్ లో పనిచేసిన 1100 మంది కార్మికులు నిషేధం విధించక ముందు రోజుకు మూడు టన్నుల మ్యాగీని ఉత్పత్తి చేసేవారు. ప్రస్తుతం ఉద్యోగాలు లేకపోవడంతో రిక్షా లాగుతూ జీవితం గడుపుతున్నారు. అయితే ఈ మధ్య మ్యాగీపై బాంబే హైకోర్టు నిషేధం ఎత్తివేయడంతో కార్మికులంతా మళ్లీ తమ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్నారని తెలిసింది.