: కాశ్మీర్ లో కుప్పకూలిన వైమానికదళ విమానం
భారత వైమానిక దళానికి చెందిన మరో మిగ్-21 విమానం కూలిపోయింది. జమ్ము కాశ్మీర్ లోని బద్గాం జిల్లాలో ఉన్న సోయ్ బగ్ ప్రాంతంలో ఈ ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వైమానిక కేంద్రం నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే విమానం కుప్పకూలి బూడిదైంది. అయితే, పైలట్ మాత్రం ప్యారాచూట్ సహాయంతో సురక్షితంగా బయటపడినట్టు రక్షణశాఖ అధికారి తెలిపారు. గత కొన్నేళ్లుగా పలు మిగ్ విమానాలు కూలిపోవడం గమనార్హం.