: కేసీఆర్ నయా నిజాంలా వ్యవహరిస్తున్నారు: శ్రవణ్
తెలంగాణ జలమండలిలో అవినీతిపై టి.కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ ధ్వజమెత్తారు. జలమండలిలో కోట్ల అవినీతి జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జలమండలి ఎండీ జగదీష్ అవినీతికి తెరలేపారని, అవినీతిని సహించనన్న సీఎం కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తక్షణమే జలమండలి ఎండీని సస్పెండ్ చేయాలని సీఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రవణ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం పోలీసులతో భయానక వాతావరణాన్ని సృష్టిస్తోందని విమర్శించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో అరెస్ట్ చేసిన కాంగ్రెస్ నేతలను తక్షణమే విడుదల చేయాలన్నారు.