: జ్యోతిలక్ష్మితో కలసి స్టెప్పులేసిన బాలకృష్ణ


ప్రముఖ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎక్కడుంటే అక్కడ సందడి నెలకొంటుంది. ఈమధ్య కాలంలో బాలయ్య సందడి మరీ ఎక్కువైంది. సెల్ఫీలకు పోజులు, వేదికలపైన డ్యాన్సులు ఇదీ బాలయ్య లేటెస్ట్ స్టైల్. హైదరాబాదులో 'సంతోషం అవార్డ్స్' వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సీనియర్ డ్యాన్సర్ జ్యోతిలక్ష్మితో కలసి బాలయ్య చిందులేశారు. ఈ డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది. మరోవైపు, మెగాస్టార్ చిరంజీవి 60వ జన్మదినోత్సవం సందర్భంగా కూడా బాలయ్య స్టెప్పులేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News