: డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి బాబూమోహన్ కౌన్సెలింగ్... భావోద్వేగంతో కంటతడి


హైదరాబాద్ లో గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లో డ్రంకెన్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారికి సినీ నటుడు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబూమోహన్ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ సమయంలో రోడ్డు ప్రమాదంలో కొన్నేళ్ల కిందట చనిపోయిన తన పెద్ద కొడుకు పవన్ కుమార్ ను ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. తాగడం తప్పు కాదని, తాగి డ్రైవింగ్ చేయడం తప్పని, కుటుంబాలను అనాథలను చేయవద్దని కోరారు. తాగి చనిపోతే పరువు పోతుందని, అందుకే ప్రమాదాల బారిన పడవద్దని వారికి చెప్పారు.

  • Loading...

More Telugu News