: కెప్టెన్ గా కోహ్లీకి తొలి టెస్టు విజయం... రెహానేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
శ్రీలంకపై ఘన విజయంతో టీమిండియా కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తొలి విజయాన్ని నమోదు చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలోనే అప్పటిదాకా కెప్టెన్ గా కొనసాగిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో వెనువెంటనే కోహ్లీకి టెస్టు జట్టు పగ్గాలు దక్కాయి. అయితే ఆస్ట్రేలియా, ఆ తర్వాత బంగ్లాదేశ్ పర్యటనల్లో టెస్టు జట్టుకు కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించినా విజయం మాత్రం దక్కలేదు. తాజాగా లంక పర్యటనలో తొలి టెస్టు పరాజయంతో లంకలోనూ కోహ్లీకి విజయం దక్కదేమోనన్న వాదనా వినిపించింది. అయితే స్పిన్నర్ల వీరవిహారంతో రెండో టెస్టులోనే కెప్టెన్ గా కోహ్లీ తొలి విజయం అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో సెంచరీతో రాణించిన అజింక్యా రెహానే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.