: గుంటూరు జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని ఏర్పాటు కానున్న గుంటూరు జిల్లాను విషజ్వరాలు కబళిస్తున్నాయి. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికే ఇద్దరు దుర్మరణం పాలవగా, అనేక మంది మంచాన పడ్డారు. తెనాలి, కొల్లిపర్ర, దుగ్గిరాల, వేమూరు, చేబ్రోలు, ఈవూరు, వినుకొండ తదితర ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న పేద ప్రజల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఈ నేపథ్యంలో, అధికారులు స్పందించి, ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు విన్నవిస్తున్నారు.