: చార్మినార్ మాజీ ఎమ్మెల్యే మస్కతి కన్నుమూత
చార్మినార్ మాజీ ఎమ్మెల్యే ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతి ఈ ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన గత కొంత కాలంగా బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఈ ఉదయం తీవ్ర అస్వస్థతకు లోనైన ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలను కంచన్ బాగ్ లోని కబరిస్తాన్ లో నిర్వహిస్తున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. గతంలో ఆయన టీడీపీ మాజీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. మస్కతి పేరుతో పాల డెయిరీని ఆయన స్థాపించారు. మస్కతి చివరి చూపు కోసం అనేక మంది తరలివస్తున్నారు.