: దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసు విచారణ షురూ... చర్లపల్లిలో ప్రారంభమైన కోర్టు


రెండేళ్ల క్రితం హైదరాబాదులోని దిల్ సుఖ్ నగర్ లో చోటుచేసుకున్న వరుస బాంబుపేలుళ్ల కేసు విచారణ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ నేతృత్వంలో జరిగిన ఈ బాంబు పేలుళ్లకు సంబంధించి అతడితో పాటు మరో నలుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కేసు విచారణ నిమిత్తం చర్లపల్లి జైల్లోనే ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది. కొద్దిసేపటి క్రితం ఈ కోర్టులో ప్రారంభమైన విచారణకు భత్కల్ సహా ఐదుగురు నిందితులను పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.

  • Loading...

More Telugu News