: ప్రముఖ కన్నడ సినీనటికి తీవ్ర గాయాలు... ఐసీయూలో చేరిక


ప్రముఖ కన్నడ సినీనటి రాగిణి ద్వివేదికి తీవ్ర గాయాలయ్యాయి. 'నానే నెక్స్ట్ సీఎం' (నేనే తదుపరి ముఖ్యమంత్రి) అనే సినిమాలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోంది. నిన్న మధ్యాహ్నం మైసూరు సమీపంలో ఓ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. స్క్రిప్ట్ ప్రకారం, ఫైటర్ విసిరిన హాకీ స్టిక్ ను ఆమె తప్పించుకోవాలి. అయితే, ఆమె అప్రమత్తంగా ఉండకపోవడంతో హాకీ స్టిక్ నేరుగా ఆమె తలకు బలంగా తగిలింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్రంగా రక్తస్రావం అయింది. వెంటనే స్థానికంగా ఉన్న ఓ కార్పొరేట్ హాస్పిటల్ కు ఆమెను తరలించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News