: చైనా ఆర్థిక వ్యవస్థ వల్లే మార్కెట్లు దెబ్బతిన్నాయి: రఘురామ్ రాజన్
భారత స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీగా పతనమవడంపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పందించారు. చైనా ఆర్థిక వ్యవస్థ కారణంగానే దేశ మార్కెట్లు ఒక్కసారిగా దిబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడి మరింత పెరుగుతోందన్నారు. ప్రాజెక్టులను మరింత వేగంగా చేపట్టాల్సి ఉందని చెప్పారు. గతవారం కొత్త బ్యాంకులకు లైసెన్సులు మంజూరు చేశామన్న గవర్నర్, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. స్టాక్ మార్కెట్ల పతనంపై ఆందోళన చెందవద్దని రాజన్ సూచించారు.