: చంద్రబాబుతో బాలయ్య భేటీ... హిందూపురం అభివృద్ధిపై చర్చ


టాలీవుడ్ అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన సొంత నియోజకవర్గం హిందూపురం అభివృద్ధిపై మరింతగా దృష్టి సారించినట్లుంది. ఇప్పటికే దఫదఫాలుగా అక్కడ పర్యటిస్తున్న ఆయన నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పర్యటనల్లో భాగంగా జనంతో మమేకమవుతున్న బాలయ్య, జిల్లాలోనే మెరుగైన పనితీరు కనబరుస్తున్న ఎమ్మెల్యేగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా నేటి ఉదయం టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హైదరాబాదులోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన బాలయ్య తన నియోజకవర్గ అభివృద్ధిపై చంద్రబాబుతో చర్చించినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News