: రైలు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి... మంత్రి పరిటాలకు, అనంత కలెక్టర్ కు ఫోన్
అనంతపురం జిల్లా మడకశిర లెవెల్ క్రాసింగ్ వద్ద గత రాత్రి చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంపై ఏసీ సీఎం నారా చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై సమాచారం తెలిసిన వెంటనే ఆయన జిల్లాకు చెందిన మంత్రి పరిటాల సునీతతో పాటు జిల్లా కలెక్టర్ కు కూడా ఫోన్ చేశారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆయన వివరాలడిగి తెలుసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆయన వారికి ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు.