: విల్లు ఎక్కుపెట్టిన జమైకా చిరుత... 100 మీటర్ల పరుగులో జయకేతనం


100 మీటర్ల పరుగులో తనకు ఎదురే లేదని జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ మరోసారి చాటి చెప్పాడు. చైనా రాజధాని బీజింగ్ లో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో బోల్ట్ జయకేతనం ఎగురవేశాడు. 100 మీటర్ల రేస్ ను సీజన్ బెస్ట్ 9.79 సెకండ్లలో పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించాడు. అంతేకాదు, తన చిరకాల పోటీదారు, అమెరికాకు చెందిన జస్టిన్ గాట్లిన్ ను రెండో స్థానానికే పరిమితం చేశాడు. సెకనులో వందో వంతు వెనుకబడ్డ గాట్లిన్ (9.80 సెకండ్లు) రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బోల్ట్, గాట్లిన్ ల మధ్య సమరాన్ని వీక్షించేందుకు వచ్చిన అభిమానులతో బర్డ్స్ నెస్ట్ స్టేడియం కిటకిటలాడిపోయింది. బోల్డ్ 5వ లైన్ లో నిలబడగా, గాట్లిన్ 7వ లైన్లో నిలబడ్డాడు. వీరిద్దరినీ ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న సమయంలో, స్టేడియం మొత్తం హోరెత్తి పోయింది. పోటీ ప్రారంభమైన అనంతరం 10 సెకండ్లపాటు స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఊపిరి పీల్చుకోవడం కూడా మరచిపోయారు. శుక్రవారం నాడు తన 29వ జన్మదినాన్ని జరుపుకున్న బోల్డ్ కు ఈ విజయం అద్భుతమైన అనుభూతిని మిగిల్చింది. 2008 ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన బోల్ట్... ఆ తర్వాత జరిగిన 2012 ఒలింపిక్స్ లో కూడా జయకేతనం ఎగురవేసి తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటాడు.

  • Loading...

More Telugu News