: రైతులను ఒప్పించండి... లేకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది: పవన్ కు రావెల సూచన


గుంటూరు జిల్లాలో రైతులతో భేటీ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి రావెల కిషోర్ బాబు స్పందించారు. ఏపీ రాజధాని నిర్మాణం కోసం భూమి ఇచ్చేలా రైతులను పవన్ కల్యాణ్ ఒప్పించాలని కిషోర్ బాబు కోరారు. లేని పక్షంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. అదే విధంగా రాజధాని నిర్మాణంలో పవన్ కూడా భాగస్వామి కావాలని అన్నారు. ఈ రోజు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు పెనుమాకలో మాట్లాడుతూ, మంత్రి రావెలపై పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News