: శ్రీలంక ముందు భారీ లక్ష్యం... ఆదిలోనే తడబడ్డ లంక


కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య దేశం ముందు భారత్ భారీ లక్ష్యం ఉంచింది. రెండో ఇన్నింగ్స్ లో ఎనిమిది వికెట్ల నష్టానికి టీమిండియా 325 పరుగులు చేసి, డిక్లేర్ చేసింది. దీంతో, తొలి ఇన్నింగ్స్ లో భారత్ ఆధిక్యతతో కలిపి శ్రీలంక ముందు 413 పరుగుల విజయలక్ష్యం మిగిలింది. భారత బ్యాట్స్ మెన్ లలో అజింక్య రహానే అద్భుత ఆట తీరుతో 126 పరుగులు చేశాడు. మురళీ విజయ్ 82, రోహిత్ శర్మ 34, అశ్విన్ 19, బిన్నీ 17, కోహ్లీ 10, మిశ్రా 10, రాహుల్ 2 పరుగులు చేశారు. సాహా 13, ఉమేష్ యాదవ్ 4 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కౌషాల్ సిల్వ కేవలం 1 పరుగు మాత్రమే చేసి అశ్విన్ బౌలింగ్ లో బిన్నీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం శ్రీలంక స్కోరు ఒక్క వికెట్ నష్టానికి 24 పరుగులు. కరుణరత్నే 4, సంగక్కర 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • Loading...

More Telugu News