: జనసేన పార్టీపై స్పష్టతనిచ్చిన పవన్ కల్యాణ్
జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ తన పార్టీ భవిష్యత్తుపై స్పష్టతనిచ్చారు. తన విజన్ 25 సంవత్సరాలని... ఇప్పటికిప్పుడే రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన లేదని తెలిపారు. జనసేనలో ఇతర నేతలు కూడా ఎవరూ లేరని... తమలాంటి అభిమానులు మాత్రమే ఉన్నారని గుంటూరు జిల్లా పెనుమాక రైతులను ఉద్దేశించి అన్నారు. అయినా, పార్టీని నడపడానికి తన దగ్గర అంత డబ్బు కూడా లేదని చెప్పారు. సినిమాల ద్వారా సంపాదించేదే తన డబ్బు అని... ఆ డబ్బు కూడా మీరు కొనే టికెట్ల ద్వారానే వస్తుందని అన్నారు. పవన్ వ్యాఖ్యలతో జనసేన పార్టీ ఇప్పట్లో పట్టాలెక్కదనే విషయం అర్థమయింది.