: పోలీసులకు 'దబాంగ్' సినిమా పాఠాలు!


ఉత్తరప్రదేశ్ లో గూండారాజ్యంగా ఆరోపణలు ఎదుర్కుంటున్న అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం రోజురోజుకీ ప్రజాదరణను కోల్పోతోంది. సమాజ్ వాదీ పార్టీ నేతల అరాచకాలు పెరిగిపోయాయి. పలు ప్రాంతాలలో అల్లర్లు నిత్యకృత్యం అయ్యాయి. పోలీసులు చూసీ చూడనట్లు మిన్నకుండిపోతున్నారు. ఫలితంగా ప్రజలలో ఆగ్రహ జ్వాలలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అన్నింటికీ మూలమైన పోలీస్ వ్యవస్థలో మార్పు తేవాలని అఖిలేశ్ సర్కారు వినూత్న ఆలోచన చేసింది.

పోలీసులకు 'దబాంగ్', 'అబ్ తక్ చప్పన్', 'సింఘం' సినిమాలను ప్రత్యేకంగా ప్రదర్శించాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఈ చిత్రాలన్నీ పోలీసులను హీరోలుగా చూపించినవే. ఇవి చూసైనా పోలీసులు తమ తీరును మార్చుకుని ప్రజల కోసం పని చేస్తారని, గూండాల తోలు తీస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై యూపీ శాంతి భద్రతల విభాగం అడిషినల్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు పోలీసుల నుంచి మంచి పనితీరును ఆశిస్తారని.. ఈ చిత్రాలతోనైనా వారు స్ఫూర్తిమంతులై తమ పనితీరు మార్చుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. మొత్తానికి సినిమాలను ఈ రకంగా కూడా ఉపయోగించుకోవచ్చన్న అఖిలేశ్ సర్కారు ఐడియా అదిరింది. మరి ఫలితమే ఎలా ఉంటుందో చూడాలి!

  • Loading...

More Telugu News