: గిరిజన మహిళపై గుడిపల్లి ఎస్సై వేధింపులు... సస్పెండ్ చేసిన నల్లగొండ జిల్లా ఎస్పీ


కంచె చేనును మేసేసింది. రక్షించాల్సిన చేతులే వేధింపులకు గురి చేశాయి. దిక్కు తోచని గిరిజన మహిళ ధైర్యం చేసింది. భక్షకుడిగా మారిన రక్షకుడిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుపై విచారణ చేయించిన పోలీసు బాసు భక్షకుడిపై వేటు వేశారు. వివరాల్లోకెళితే... నల్లగొండ జిల్లా గుడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేస్తున్న కొండల్ రెడ్డి బాధ్యత మరచి గిరిజన మహిళపై కన్నేశాడు. అతడి వేధింపులతో విసిగిపోయిన గిరిజన మహిళ జిల్లా ఎస్పీ విక్రమ్ జిత్ దుగ్గల్ కు ఫిర్యాదు చేసింది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయించిన ఎస్పీ, కొండల్ రెడ్డి వేధింపులు వాస్తవమేనని తెలుసుకుని అతడిపై సస్పెన్షన్ వేటు వేశారు.

  • Loading...

More Telugu News