: గున్న ఏనుగు క్షేమం... బావి చుట్టూ తవ్వి బయటకు తీసిన అటవీ అధికారులు


చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం చిక్కపల్లి తండాలో ప్రమాదవశాత్తు బావిలో పడ్డ గున్న ఏనుగు ఎట్టకేలకు సురక్షితంగా బయట పడింది. గ్రామస్థుల నుంచి సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి పోక్లెయినర్ ను తెప్పించారు. లోతుగా ఉన్న బావి చుట్టూ పోక్లెయిన్ తో తవ్వించి కందకం మాదిరి దారిని ఏర్పాటు చేయగా, గున్న ఏనుగు దాని ద్వారా క్షేమంగా ఒడ్డుకు చేరింది. గున్న ఏనుగును రక్షించుకునేందుకు అంతకుముందు 26 ఏనుగుల గుంపు అక్కడికి చేరుకున్న సంగతి తెలిసిందే. బావిలో చిక్కుకుని ఆర్తనాదాలు చేసిన గున్న ఏనుగును చూసేందుకు రాగా బావిలో నుంచి బయటపడ్డ గున్న ఏనుగు జనాల అరుపులతో బెదిరిపోయింది. గ్రామస్థులపైకి దండెత్తింది. దీంతో భయంతో జనం పరుగులు తీశారు. అక్కడే ఉన్న అటవీ శాఖాధికారులు సదరు గున్న ఏనుగును తన తల్లి గుంపుతో కలిపేందుకు చర్యలు చేపడుతున్నారు.

  • Loading...

More Telugu News