: చెన్నైలో మాస్టర్ బ్లాస్టర్ సందడి... ఏఆర్ రెహ్మాన్ ఇంటికెళ్లిన సచిన్


క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రమేశ్ టెండూల్కర్ నిన్న తమిళనాడు రాజధాని చెన్నైలో సందడి చేశారు. ఓ ట్రస్ట్ కు చెందిన కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు చెన్నై వెళ్లిన సచిన్, ఆ తర్వాత నేరుగా కోడంబాక్కంలోని ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మార్ ఇంటికి వెళ్లారు. తనకు మిత్రుడైన రెహ్మాన్ తో కొద్దిసేపు ముచ్చటించిన సచిన్... సంగీతం రూపకల్పన, పాటలకు బాణీలు కట్టే తీరుపై రెహ్మాన్ కు సరదా ప్రశ్నలు సంధించారు. దీంతో అక్కడికక్కడే కొన్ని బాణీలు కట్టిన రెహ్మాన్ తన మిత్రుడి ఉబలాటాన్ని తీర్చారు.

  • Loading...

More Telugu News